Friday, 19 September 2014

Updated : 9/20/2014 7:25:11 AM
హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయని, విద్యుత్‌లోటును తీర్చేందుకు సౌర విద్యుతే శ్రేయస్కరమని ప్రీమియర్ సోలార్ పవర్‌టెక్ సంస్థ చైర్మన్ ఎస్‌పీ సింగ్ అన్నారు. ఇంధన వనరుల కొరత, పర్యావరణ పరిరక్షణ రిత్యా ప్రపంచదేశాలన్నీ సోలార్‌పవర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండుదశాబ్దాలుగా తమ సంస్థ సోలార్ ప్యానెల్ తయారీ, సోలార్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) రంగాల్లో సేవలందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సబ్సిడీ ప్రోత్సాహకాలను వినియోగించుకొంటే వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయొచ్చన్నారు. సమావేశంలో సంస్థ సీఇవో కార్తిక్ పోల్‌సాని, డైరెక్టర్ అజయ్‌రెడ్డి పాల్గొన్నారు.


No comments:

Post a Comment